Tirumala Tirupati: తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు.. రద్ధీ దృష్ట్యా నిర్ణయం...
Tirumala Tirupati: శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేయడంతో భక్తుల ఆగ్రహం...
Tirumala Tirupati: తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు.. రద్ధీ దృష్ట్యా నిర్ణయం...
Tirumala Tirupati: తిరుమల వెంకన్న సన్నిధిలో పాలకమండలి అనుకున్న విధంగానే ఆర్జితసేవలను రద్దుచేసింది. వారపు ఆర్జితసేవలు ప్రతి మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, గురువారంనాడు నిర్వహించే తిరుప్పావడ సేవ, శుక్రవారం అభిషేకానంతరం నిర్వహించే నిజపాద దర్శన సేవలను రద్దుచేశారు. వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాలకమండలి ప్రకటించింది.
ఇప్పటికీ... విశేషపూజాసేవలుగా నిర్వహిస్తున్న శ్రీవారి విశేషపూజ, సహస్రకలశాభిషేకం, నిత్య వసంతోత్సవాలను రద్దుచేసిన టీటీడీ తాజాగా మరో మూడు సేవలను రద్దు చేసింది. స్వామివారిసేవలను రద్దుచేయడాన్ని శ్రీవారి భక్తులు తప్పుబడుతున్నారు.