TTD Board Meeting: రేపు టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం

TTD Board Meeting: తిరుమల, తిరుపతి దేవస్థానం దర్మకర్తల మండలి అత్యవరంగా సమావేశం కానుంది.

Update: 2020-07-03 03:00 GMT

TTD Board Meeting: తిరుమల, తిరుపతి దేవస్థానం దర్మకర్తల మండలి అత్యవరంగా సమావేశం కానుంది. లాక్ డౌన్ అనంతరం దర్శనాలను ప్రారంబించిన పాలకమండలి ఇటీవల కాలంలో పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా తీసుకునే చర్యలపై దీనిపై చర్చించనున్నారు. దీనికి ఎక్కడివారు అక్కడే ఉంటూ వీడియో కాన్పెరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశాన్ని శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో మార్చిలో రద్దయిన దర్శనాలను జూన్‌11 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. 6 వేల మందితో ప్రారంభించిన శ్రీవారి దర్శనాల సంఖ్య ప్రస్తుతం 12 వేలకు పైగా చేరుకుంది. మరోవైపు రోజురోజుకు కరోనా కేసులు కూడా పెరుగుతున్న క్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై టీటీడీ ధర్మకర్తల మండలి చర్చించనున్నట్ట్టు సమాచారం.

కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో లాక్ డౌన్ సందర్భంగా దాదాపు రెండు నెలల పాటు శ్రీవారి దర్శనాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. నిబంధనలు సడలించిన తరువాత పరిమిత సంఖ్యలో భక్తులకు ప్రవేశాన్ని కల్పిస్తోంది టీటీడీ. అయితే, ముందుగా దర్శనానికి స్లాట్ బుక్ చేసుకున్నవారికి ఆ సమయానికి మాత్రమె లైనులోకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. భౌతికదూరం.. వైద్య పరీక్షలు.. వంటి అన్ని జాగ్రత్తలూ టీటీడీ తీసుకుంటోంది. ఈమధ్య కాలంలో శ్రీవారి దర్శనం కోసం ప్రజలు ఎక్కువగా రావడం మొదలైంది. దీంతో మరిన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ విషయం పై చర్చించేందుకు బోర్డు సమావేశం కానుంది. 

Tags:    

Similar News