రోడ్డు దాటాలంటే.. సర్కస్ ఫీట్లు చేయ్యాల్సిందే..

Update: 2019-08-08 06:18 GMT

విశాఖపట్నం: చింతపల్లి. ఏజెన్సీలో గత 20 రోజులుగా కురుస్తున్న వర్షాలతో మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి గిరిజనులు ప్రయాణాలు చేయటానికి సర్కస్ ఫీట్లు వేయవలసి వస్తుంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న రహదారి రవాణా వ్యవస్థలు, దానితోపాటు జోరుగా కురుస్తున్న వర్షాలు కారణంగా ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్లడానికి పడరాని పాట్లు పడవలసి వస్తుంది. వాగులు పొంగి పోయి ఇటు నుంచి అటు దాటే వీలు లేక పూర్తి చేయవలసిన వంతెనలు పూర్తి కాకపోవడంతో వేరే గత్యంతరం లేక అవతల ఒడ్డు నుంచి ఇవతలి ఒడ్డు కు తాడు కట్టుకుని, ఆ తాడు సహాయంతో అవతలి ఒడ్డుకు చేరవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రాణాలు సైతం ఒడ్డి ప్రయాణించ వలసిన ఈ స్థితిని తలుచుకుంటేనే భయమేస్తోంది. ఇకనైనా అధికారులు స్పందించి ఈ గ్రామానికి వెళ్లే రహదారి మధ్యలో ఉన్న వంతెనను పూర్తి చేస్తారని అక్కడి ప్రజలు కోరుతున్నారు. 

Tags:    

Similar News