అక్రమ గ్రానైట్ తరలింపు పై చోడవరం గిరిజనుల ఆందోళన

Update: 2020-10-02 05:59 GMT

విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో గ్రానిట్ తవ్వకాల అనుమతులతో పర్యవరణం కలుషితమవుతోందని గిరిజనులు ఆందోళన చేపట్టారు. అటవీశాఖాధికారుల చొరవతో సదరు స్టోన్ కంపెనీలపై కేసులు నమోదు చేసినప్పటికీ, అక్రమంగా గ్రానైట్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మరోసారి స్థానికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలోని రావికమతం మండలం చీమలపాడు అటవీ ప్రాంతంలో గ్రానైట్ తవ్వకాల వల్ల పర్యావరణం కాలుష్యమవుతోందని గ్రామీణ కార్మిక సంఘం, గిరిజన సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా క్వారీ వల్ల పర్యవరణాన్ని కాపాడాలంటూ మైనింగ్ అనుమతులు రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు.

మే నెలలో డిఎఫ్ఓ నివేదికపై మైన్స్ ఏడీ స్టోన్స్ ప్లస్ సంస్థ యాజమాన్యానికి షోకాజ్ నోటీస్ జారీ చేసి, మూడు గ్రానైట్ తరలించే యంత్రాలతో పాటు 197 గ్రానైట్ బ్లాకులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై స్టోన్స్ ప్లస్ యాజమాన్యం హైకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. ఐతే వారం రోజుల్లో సంజాయిషీ నోటీసుకు పిటిషనర్ సమాధానం ఇవ్వాలని రెండు వారాల్లో చట్ట ప్రకారం అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఉన్నత న్యాయస్థానం మధ్యాంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మైనింగ్ రాళ్లను తరలించేందుకు ఎక్కడా ప్రాస్తవించని హైకోర్టు ఉత్తర్వులను ఆసరాగా చేసుకొని సీజ్ చేసిన గ్రానైట్ ను తరలించుకొనిపోయేందుకు స్టోన్ ప్లస్ యాజమాన్యం ప్రయత్నించింది. ఐతే దీనికి వ్యతిరేకంగా వ్యవసాయ, గిరిజన, గ్రామీణ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. స్థానికులు గత 3 రోజులుగా ట్రక్కుల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ మైన్స్ ఏడీ గానీ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారు కానీ మీనమేషాలు లెక్కిస్తున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి అక్రమంగా గ్రానైట్ ను తరలించేందుకు ప్రయత్నిస్తున్న స్టోన్ ప్లస్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.

Full View


Tags:    

Similar News