వాటర్ ట్యాంక్ కిందనే గర్భిణులకు చికిత్స

Katrenikona: కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో గ్రామీణ పేదలకు వైద్యసేవలు ఎంతో కష్టంగా మారాయి.

Update: 2022-04-28 13:08 GMT

వాటర్ ట్యాంక్ కిందనే గర్భిణులకు చికిత్స

Katrenikona: కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో గ్రామీణ పేదలకు వైద్యసేవలు ఎంతో కష్టంగా మారాయి. గర్భిణులకు వైద్యం మాత్రం మరీ దారుణంగా తయారైంది. మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకు కింద సిమెంట్ బల్లలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. అక్కడే సెలైన్స్ ఎక్కిస్తున్నారు. ఆస్పత్రి భవనం కూడా సరిగ్గా లేక గర్భిణులు, బాలింతలు, ఇతర రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆసుపత్రి పాత భవనాన్ని కూల్చేయడంతో ఏడేళ్ల నుంచి పంచాయతీ కార్యాలయం పక్కనే ఉన్న రెండు ఇరుకు గదుల్లో చికిత్సలు చేస్తున్నారు. ఇక్కడ కూర్చునే అవకాశం కూడా ఉండదు. పక్కనే ఉన్న మంచినీటి ఓవర్‌హెడ్‌ ట్యాంకు వద్ద పడుకోబెట్టి గర్భిణులకు సెలైన్‌ ఎక్కిస్తారు. చుట్టుపక్కల 30 వేల మందికి ఈ ఆసుపత్రే ఆధారం. ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణం స్పందించాలని రోగులు కోరుతున్నారు.

Tags:    

Similar News