రాష్ట్ర విభజన తర్వాత టాలీవుడ్‌గా విశాఖ పేరు

ముఖ్యమంత్రి పిలుపుతో తిరిగి అందుకున్న జోష్‌

Update: 2022-03-01 15:00 GMT

రాష్ట్ర విభజన తర్వాత టాలీవుడ్‌గా విశాఖ పేరు

Visakhapatnam: చెన్నై నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ షిఫ్ట్ అవుతుందన్నపుడు సినీ హబ్బుగా విశాఖ పేరు గట్టిగా వినిపించింది. అయితే హైదరాబాద్ లోనే చివరికి సెటిల్ అయింది. విభజన తరువాత మళ్ళీ విశాఖనే టాలీవుడ్ అంటూ గట్టిగానే ప్రచారం సాగినా అది ప్రచారంతోనే ఆగిపోయింది. ఐతే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధి చేస్తామని, రాయితీలు ఇస్తామని ప్రకటించడంతో తిరిగి కొంత జోష్ కనిపిస్తోంది.

మద్రాసు, హైదరాబాద్‌ తరువాత షూటింగులకు అనుకూలమైన ప్రాంతంగా విశాఖ గుర్తింపు పొందింది. ప్రస్తుతం విశాఖలో ఎక్కడ చూసినా సినిమా షూటింగ్‌ సందడి కనపడుతోంది. షార్ట్‌ ఫిల్మ్‌ల నుంచి భారీ బడ్జెట్‌ చిత్రాల చిత్రీకరణ విశాఖలోనే జరుగుతున్నాయి. కేవలం తెలుగు సినిమాలే కాకుండా తమిళ్, హిందీ, బెంగాలీ, ఒడియా, కన్నడతో పాటు అనేక భాషాల చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్నాయి.

సినిమా షూటింగ్ లు జరపడానికి అవసరమైన మౌలిక వసతులు, అత్యాదునిక సౌకర్యాలు విశాఖలో అందుబాటులో ఉన్నాయి. సాగరతీరం, పచ్చని కొండలు, అబ్బురపరిచే ప్రకృతి అందాలు, అరకులోయ సౌందర్యం వంటి టూరిస్ట్ ప్రాంతాలన్నీ షూటింగులకు అనువైనవే అని సినీ పరిశ్రమ ఎప్పుడో గుర్తించింది.

ఈ మద్య ఏ కొత్త సినిమా వచ్చినా విశాఖలోనే ఫ్రీ రిలీజ్‌ ఫంక్షన్‌గానీ, సక్సెస్‌ మీట్‌గానీ పెట్టి ప్రజలను అలరిస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత హైద్రబాద్ తో పాటు విశాఖలో కూడా ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్నారంటే విశాఖ రెంజ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Tags:    

Similar News