ఈరోజు కడప జిల్లాలో ఎస్‌ఈసీ టూర్
* ఎన్నికల ఏర్పాట్లు, నిర్వహణపై సమీక్ష * ఫిబ్రవరి 1నుంచి ఉత్తరాంధ్రలో పర్యటన
SEC Nimmagdda Ramesh (file image)
సుప్రీం తీర్పుతో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటోన్న ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఈరోజు కడప జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, ఫిబ్రవరి 1నుంచి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో నిమ్మగడ్డ పర్యటించనున్నారు. ఫిబ్రవరి ఒకటిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఫిబ్రవరి రెండున విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరిలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లు, భద్రతపై సమీక్ష జరపనున్నారు. ఫిబ్రవరి 9నాటికి మొత్తం రాష్ట్రమంతటా పర్యటించనున్నారు.