ప్రజాదర్బార్ నిర్వహించిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి ప్రజా దర్బార్ నిర్వహించారు.

Update: 2025-11-07 07:27 GMT

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఒకవైపు క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజాదర్బార్ నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. ప్రతి నెల స్థానిక ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ పేరిట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్నిపై ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్యే కొలికపూడి పై స్థానిక నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రజా దర్బార్ నిర్వహణకు సంబంధించి కూడా ఉదయం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ కేశినేని చిన్ని ఫోటో లేకపోవడాన్ని ఆయన వర్గీయులు తీవ్రంగా తప్పు పట్టారు. దీంతో హడావుడిగా రాత్రి మళ్ళీ ఫ్లెక్సీ మార్చి అందులో కేశినేని చిన్ని ఫోటో కూడా వేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్రజా దర్బార్ కు కొంత మంది అధికారులు కూడా డుమ్మా కొట్టారు. దీంతో అసలు ప్రజా దర్బార్ జరుగుతుందో లేదో అన్న అనుమానం ఉండగా... ఆలస్యంగా అధికారులు హాజరు కావడంతో ఎమ్మెల్యే ఊపిరి పీల్చుకున్నారు. 

Tags:    

Similar News