Tirupati Exit Poll: తిరుపతి ఉప ఎన్నిక ఎగ్జిట్‌పోల్స్‌లో వైసీపీ హవా

Tirupati Exit Poll: తిరుపతి క్షేత్రం, తిరిగి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌దేనని తేల్చాయి ఎగ్జిట్‌పోల్స్. అధికార పార్టీ అభ్యర్థిదే విజయమని అభిప్రాయపడ్డాయి.

Update: 2021-04-30 06:12 GMT

Tirupati Exit Poll: తిరుపతి ఉప ఎన్నిక ఎగ్జిట్‌పోల్స్‌లో వైసీపీ హవా


Tirupati Exit Poll: తిరుపతి క్షేత్రం, తిరిగి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌దేనని తేల్చాయి ఎగ్జిట్‌పోల్స్. అధికార పార్టీ అభ్యర్థిదే విజయమని అభిప్రాయపడ్డాయి. టీడీపీకి రెండోస్థానం, బీజేపీకి మూడోస్థానం తప్పదన్నాయి సర్వే సంస్థలు.

తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కొన్ని రోజుల పాటు రణక్షేత్రంగా మార్చాయి బైపోల్స్. బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో, తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక అనివార్యంగా మారింది. స్థానాన్ని నిలబెట్టుకుని, తమపై ప్రజలకు వ్యతిరేకత లేదని నిరూపించాలని వైసీపీ పట్టుదలగా పోరాడింది. అటు పార్టీలో పునరుజ్జీవానికి తిరుపతి ఎన్నికే కీలకమని టీడీపీ ఫైట్ చేసింది. తిరుపతి ఎంట్రీతోనే ఏపీలో దూసుకుపోవాలని కమలసేన కరవాలనం చేసింది. మూడు పార్టీల నువ్వానేనా పోరే, ఫలితంపై ఉత్కంఠను పెంచింది. అయితే, ఎగ్జిట్‌పోల్స్ మాత్రం ప్రతిపక్షాలకు నిరాశ కలిగిస్తున్నాయి.

తిరుపతి లోక్‌సభ బైపోల్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌దే విజయమని అంచనా వేసింది ఆరా సర్వే సంస్థ. 65.85 శాతం ఓట్లతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గెలుస్తారని అభిప్రాయపడింది. 23.10శాతం ఓట్లతో తెలుగుదేశం రెండోస్థానంలో నిలుస్తుందని వెల్లడించింది ఆరా. ఇక బీజేపీ 7.34 శాతం ఓట్లతో మూడో స్థానానికే పరిమితమని ఎగ్జిట్‌పోల్స్‌ అభిప్రాయం. స్వతంత్రులు, ఇతర పార్టీల ఓటు శాతం 3.71 శాతమని తెలిపింది ఆరా. మొత్తానికి తిరుపతి, తిరిగి వైసీపీదేనని సర్వే సారాంశం. మే 2న వెల్లడికానున్న అసలు ఫలితం ఎలా వుంటుందో చూడాలి.

Tags:    

Similar News