Vaikuntha Ekadashi Darshan: తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనం..9 ప్రాంతాల్లో టోకెన్లు

Update: 2024-12-26 01:11 GMT

Tirumala Tickets

Vaikuntha Ekadashi Darshan: తిరుమల శ్రీవారికి దర్శించుకునే భక్తులకు బిగ్ అలర్ట్. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు వెళ్లాలనుకునే భక్తుల కోసం టీటీడీ విస్త్రుత ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతి నగరంలో 9 ప్రాంతాల్లో వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లు జారీకి కేంద్రాలను ఏర్పాటు చేసింది. క్యూలైన్లలో భక్తులు సంయమానం పాటించాలని తోపులాటకు ఆస్కారం లేకుండా టోకెన్లు పొందేందుకు చర్యలు తీసుకుంటోంది. అలాగే ప్రతి భక్తుడు వైకుంఠ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. టికెట్ల కౌంటర్ల దగ్గర పోలీసులు భారీ కేడింగ్ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు.

10 రోజుల పాటు జరగనున్న వైకుంఠ ద్వారా దర్శనం డిసెంబర్ 24వ తేదీన పోలీస్ అధికారులు, టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి , జేఈవో శ్రీమతి గౌతమి, జిల్లా కలెక్టర్ తోపాటు పలువురు అధికారులు భద్రతపై సమీక్షించారు.

ప్రజల సౌకర్యార్థం నగరంలో 9 ప్రాంతాల్లో టోకెన్ జారీ చేయు కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసిందని..అక్కడ రద్దీకి తగ్గట్టు బందోబస్తును ఏర్పాటు చేశామని చెప్పారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాలతో పాటు పది రోజులపాటు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి వైకుంఠ ద్వారా దర్శనం భక్తులకు చేసుకునే విధంగా ఏర్పాట్లను టీటీడీ చేసిందని, స్థానిక ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్త జనం కోసం అన్ని భద్రతాపరమరైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

Tags:    

Similar News