కరోనా ఎఫెక్ట్ : ఒకసారి భోజనం చేసేందుకు 500మందికే అనుమతి

కరోనా కట్టడి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మరో ముందస్తు చర్యలు తీసుకుంది. ఉచిత నిత్య అన్నదాన భవనంలోకి జనాలను తగ్గించారు.

Update: 2020-03-17 14:27 GMT
Tirumala(File Photo)

కరోనా కట్టడి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మరో ముందస్తు చర్యలు తీసుకుంది. ఉచిత నిత్య అన్నదాన భవనంలోకి జనాలను తగ్గించారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ ఉచిత అన్నప్రసాద భవనంలో ఒక్కోక్క హాలులో ఒకేసారి వెయ్యి మంది తినే సదుపాయం ఉంది. దాంతో ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో భవనంలోకి 500మందికే మాత్రమే అన్నం తినే సదుపాయం కల్పించనున్నారు. నలుగురు కూర్చునే టేబుల్ పై ఇద్దరికే అవకాశం కల్పిస్తున్నారు.

ప్రధాన కల్యాణ కట్టతో పాటు తిరుమలలో ఉన్న మినీ కల్యాణ కట్టలలో భక్తులు వేచి ఉండకుండా సత్వరం తలనీలాలు సమర్పించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి 2గంటలకోకసారి శానిటైజ్ చర్యలు చేపట్టాలని టీటీడీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.. 

Tags:    

Similar News