Tirumala Laddu: సుప్రీంకు చేరిన తిరుమల లడ్డూ వ్యవహారం.. CJIకి లేఖ రాసిన జర్నలిస్ట్
Tirumala Laddu: సీజేఐకి లేఖ రాసిన జర్నలిస్ట్ సురేష్ చౌహాన్కే
Tirumala Laddu: సుప్రీంకు చేరిన తిరుమల లడ్డూ వ్యవహారం.. CJIకి లేఖ రాసిన జర్నలిస్ట్
Tirumala Laddu: భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ నాణ్యత వ్యవహారం పెనుదుమారం రేపుతోంది. టీటీడీ లడ్డూ వ్యవహారంపై భారత ప్రధాన న్యాయమూర్తికి జర్నలిస్టు సురేష్ చౌహాన్కే లేఖ రాశారు. టీటీడీ బోర్డు మిస్మేనేజ్మెంట్, మత విశ్వా్సాలను వమ్ము చేశారంటూ లేఖలో పేర్కొన్నారు.
ఆలయాల పవిత్రత, మత విశ్వాసాలు, సంప్రదాయాలపై అవగాహన కలిగిన వారి చేతికే ఆలయాల నిర్వాహణ బాధ్యతలు అప్పగించాలని పిటిషనర్ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం నియమించిన అధికారుల కారణంగానే ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. తక్షణమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని తగిన ఆదేశాలు జారీచేయాలని విజ్ఞప్తి చేశారు.