Tirumala: చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి

Tirumala: మల్లయప్ప స్వామిని దర్శనానికి భారీగా భక్తుల రాక

Update: 2023-10-16 05:36 GMT

Tirumala: చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి

Tirumala: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. మల్లయప్ప స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీవారి మాడవీధుల్లో ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Tags:    

Similar News