పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో పరిసర గ్రామ ప్రజలు
West Godavari: పాదముద్రలను సేకరించిన అటవీ సిబ్బంది...
పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం.. భయాందోళనలో పరిసర గ్రామ ప్రజలు
West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారాన్ని నిర్దారించారు. బుట్టయగూడెం మండలం కన్నాపురం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని దండిపూడి గిరిజన గ్రామం సమీపంలో రెండు రోజుల క్రితం పెద్దపులు పాదముద్రలను సేకరించారు. కండ్రికగూడెం సమీపంలోని పేరంటాలమ్మ కొండ వద్ద పెద్దపులి పాదముద్రలను సేకరించారు.
పులి సంచారాన్ని గుర్తించేందుకు అటవీ ప్రాంతంలో ఐదు చోట్ల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పశ్చిమ ఏజెన్సీలో ఇప్పటి వరకు పులి సంచారం లేదని.. తెలంగాణలోని అటవీ ప్రాంతం నుంచి ఆహారం కోసం వచ్చి ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. పెద్దపులి సంచరిస్తోందన్న సమాచారంతో దండిపూడి పరిసర గ్రామాల గిరిజనులు భయబ్రాంతులకు గురవుతున్నారు.