ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Prakasam District: తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద ప్రమాదం
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
Prakasam District: ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. వేగంగా ఎదురుగావస్తున్న లారీని బైక్ ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. అర్థరాత్రి సమయంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులు కొనకనమిట్ల మండలం అంబాపురం గ్రామానికి చెందిన వినోద్, నాని, వీరేంద్రగా గుర్తించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.