Tirumala: తిరుమ‌ల‌లో ముగ్గురు చిన్నారులు అదృశ్యం

Tirumala: ఎస్వీ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్న పిల్లలు

Update: 2023-12-07 01:46 GMT

Tirumala: తిరుమ‌ల‌లో ముగ్గురు చిన్నారులు అదృశ్యం

Tirumala: తిరుమలలోని ఆర్బీసీ సెంటర్‌కు చెందిన ముగ్గురు చిన్నారులు నిన్న మధ్యాహ్నం అదృశ్యమయ్యారు. తిరుమలకు చెందిన ఎస్ కృష్ణ తనయుడు చంద్రశేఖర్(13), యోగేశ్ కుమారుడు వైభవ్ యోగేశ్(13), శ్రీవరదన్ (13) అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ముగ్గురు విద్యార్థులు తిరుమలలోని ఎస్వీ హైస్కూల్లో ఏడో తరగతి చదువుతున్నారు. మధ్యాహ్నం పుస్తకాలు తెచ్చుకునేందుకు ఇంటికి వెళ్తామని పాఠశాలలో చెప్పారు. ఇంటికి వచ్చి ల్యాప్టాప్ తీసుకొని బస్సెక్కి తిరుపతి ఏడుకొండల బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి వారి ఆచూకీ తెలియలేదు. విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాలలో ఆరా తీశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News