స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్

* 2015 జూన్‌లోనే కుంభకోణానికి స్కెచ్ వేసినట్లు రిపోర్ట్ * రూ.241 కోట్లను షెల్ కంపెనీలకు బదలాయింపు

Update: 2021-12-12 11:06 GMT

సీఐడీ

Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది కోర్టు. రిమాండ్ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. 2015 జూన్‌లోనే కుంభకోణానికి స్కెచ్ వేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. 241 కోట్ల రూపాయలను పలు షెల్ కంపెనీలకు బదలాయించినట్లు సీఐడీ గుర్తించింది. ఏడు షెల్ కంపెనీల ద్వారా తప్పుడు ఇన్వాయిస్‌లు సృష్టించినట్లు గుర్తించారు.

ఇక స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలు ప్రారంభించకుండానే డిజైన్ టెక్ అకౌంట్‌లో 371 కోట్లు డిపాజిట్ చేసినట్లు గుర్తించిన సీఐడీ 2017-18 ఆర్థిక సంవత్సరంలో 371 కోట్లలో 241 కోట్ల గోల్‌మాల్ జరిగినట్లు గుర్తించారు. పలు కీలక డాక్యుమెంట్లు, పత్రాలను ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి తొలగించినట్లు గుర్తించింది సీఐడీ.

Tags:    

Similar News