Chandrababu: చిత్తూరు జిల్లాలో చంద్రబాబు రోడ్ షో మూడో రోజు
Chandrababu: గుడుపల్లె మండలంలో పర్యటన బాబు సభలకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు
Chandrababu: చిత్తూరు జిల్లాలో చంద్రబాబు రోడ్ షో మూడో రోజు
Chandrababu: చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలోని పలు గ్రామాల్లో చంద్రబాబు మూడోరోజు రోడ్ షో నిర్వహించనున్నారు. బాబు సభలకు, ర్యాలీలకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు బాబు ప్రచార రథాన్ని తొలిరోజే స్వాధీనం చేసుకున్నారు. కుప్పానికి వచ్చిన బాబును అడ్డుకున్నారు. నోటీసులు ఇచ్చారు. కానీ చంద్రబాబు యధావిధిగా తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు స్థానిక టీడీపీకి చెందిన నేతలపై కేసులు నమోదు చేశారు.
రెండోరోజు పార్టీ లీడర్లతో సమావేశానికే పరిమితమైన బాబు మూడో రోజు మళ్లీ తన పర్యటన కొనసాగించనున్నారు. గుడుపల్లె మండలంలో పలు చోట్ల సభల్లో ప్రసంగించన్నారు. ఓ వైపు భారీ పోలీసు బలగాలు, మరోవైపు కుప్పంలో చంద్రబాబు బస చేసిన ఆర్ అండ్ బీ అతిథిగృహం వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. తన ప్రచార రథాన్ని తెచ్చివ్వాలని అల్టిమేట్టం జారీ చేసిన చంద్రబాబు మున్ముందు ఎలా వ్యవహరించబోతారనేది ఉత్కంఠగా మారింది.