NTR District: నందిగామలో విగ్రహాల తొలగింపు ఉద్రిక్తం.. టీడీపీ నేతల ధర్నా

NTR District: అధికారులకు వినతిపత్రం ఇస్తామన్నా అనుమతించని పోలీసులు

Update: 2023-08-17 04:12 GMT

NTR District: నందిగామలో విగ్రహాల తొలగింపు ఉద్రిక్తం.. టీడీపీ నేతల ధర్నా

NTR District: ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. విగ్రహాల తొలగింపు విషయంలో ఘర్షణ తలెత్తింది. గాంధీ సెంటర్‌లో మున్సిపల్‌ సిబ్బంది విగ్రహాలను తొలగిస్తున్నారన్న సమాచారంతో.. అక్కడకు చేరుకొని విగ్రహాల తొలగింపును అడ్డుకున్నారు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. అయితే.. కోర్టు ఆదేశాలతోనే విగ్రహాలను తొలగిస్తున్నామని మున్సిపల్‌ అధికారులు చెప్పారు. దీంతో.. మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన సౌమ్య, టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అధికారులకు వినతిపత్రం ఇస్తామన్నా పోలీసులు అనుమతించకపోవడంతో..

టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడున్న వైసీపీ నేతలు.. టీడీపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం.. తోపులాట చోటుచేసుకోవడంతో.. అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించారు మాజీ ఎమ్మెల్యే సౌమ్య, టీడీపీ నేతలు. వైసీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేస్తామని పోలీసులు సర్దిచెప్పడంతో నిరసన విరమించారు మాజీ ఎమ్మెల్యే సౌమ్య, టీడీపీ నేతలు.

Tags:    

Similar News