Abdul Nazeer: ధర్మాన్ని, సత్యాన్ని సమాజానికి తెలపాలి
Abdul Nazeer: తిరుపతి టీటీడీ మహతి కళాక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ 7వ స్నాకోత్సవానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Abdul Nazeer: ధర్మాన్ని, సత్యాన్ని సమాజానికి తెలపాలి
Abdul Nazeer: వేద విద్యార్థులు వేదాలను విశ్వ వ్యాప్తం చేయాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సూచించారు. ధర్మాన్ని , సత్యాన్ని సమాజానికి తెలియ జేయాలన్నారు. వేదిక్ యూనివర్సిటీ దినదినాభివృద్ధి చెందుతోందని చెప్పారు. తిరుపతి టీటీడీ మహతి కళాక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ 7వ స్నాకోత్సవానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పీహెచ్ డి పూర్తి చేసిన 550 మంది వేద విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. ఇద్దరు మహోపాధ్యాయులను సత్కరించారు. మరో ఇద్దరికి వాచస్పతి పురస్కారాలను గవర్నర్ అందజేశారు.