ఏపీలో ఎన్నికల కసరత్తు షురూ.. రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల బృందం
Election Commission: ఏపీలో ఎన్నికల కసరత్తు షురూ అయింది.
ఏపీలో ఎన్నికల కసరత్తు షురూ.. రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల బృందం
Election Commission: ఏపీలో ఎన్నికల కసరత్తు షురూ అయింది. ఎన్నికల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది కేంద్రం ఎన్నికల సంఘం. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏడుగురు అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించింది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఆర్‌కే గుప్తా, హిర్దేశ్‌కుమార్, అజయ్‌బాదో తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు అధికారులు. ఎన్నికలకు చేయాల్సిన ఏర్పాట్లు, భద్రతా, ఓటర్ జాబితాపై అధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, అవకతవకలు, లోపాలపై ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై కూడా జిల్లా ఎన్నికల అధికారులను ప్రశ్నించారు.