నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు.. ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండే విధంగా..
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారయ్యింది.
నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారు.. ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండే విధంగా..
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు ముహూర్తం ఖరారయ్యింది. 2023 జనవరి 27న లోకేష్ పాదయాత్ర ప్రారంభంకానుంది. చిత్తూరు జిల్లా కుప్పం నుండి పాదయాత్ర ప్రారంభంకానుంది. కుప్పం నుండి ఇచ్చాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. ఇక ఏడాది పాటు ప్రజల మధ్యే ఉండే విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగం ప్రధాన అంశాలుగా లోకేష్ పాదయాత్ర సాగనుంది. రైతాంగం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా ప్రణాళికను రూపొందించారు.