Train Accident: కంటకాపల్లి రైలు ఘటనపై కేంద్రం సీరియస్
Train Accident: నేడు ఘటనా స్థలిని పరిశీలించనున్న విచారణ కమిటీ
Train Accident: కంటకాపల్లి రైలు ఘటనపై కేంద్రం సీరియస్
Train Accident: కంటకాపల్లి రైలు ఘటనపై కేంద్రం సీరియస్ అయ్యింది. రైలు ప్రమాద ఘటన మానవ తప్పిదమా లేక.. సాంకేతిక లోపమా తేల్చాలంటూ విచారణ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఘటనా స్థలిని విచారణ కమిటీ పరిశీలించనుంది. అనంతరం కేంద్రానికి కమిటీ నివేదిక అందివ్వనుంది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలవగా క్షతగాత్రులకు విజయనగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.