ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
Andhra Pradesh: ఉ. 9-30 నుంచి మ.12.45 వరకు పరీక్షలు, ఈసారి టెన్త్ పరీక్షలు ఏడు పేపర్లకే పరిమితం
ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
Andhra Pradesh: ఏపీలో ఇవాళ్టి నుంచి మే 6 వరకు పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12-45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం టెన్త్ పరీక్షలు ఏడు పేపర్లకే పరిమితం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పరీక్షలకు 6లక్షల 22 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇటు పరీక్ష కేంద్రాలను 2వేల నుంచి 3,800లకు పెంచారు అధికారులు. కోవిడ్ నిబంధనలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు సంవత్సరాల తర్వాత పది పరీక్షలు నిర్వహిస్తుండటంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.