Visakhapatnam: ట్రాఫిక్ సమస్య పేరుతో జగన్‌కు అనుమతి నిరాకరణ.. విశాఖలో రేపు ఏం జరగబోతోంది?
Visakhapatnam: విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ సీఎం జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు.
Visakhapatnam: విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ సీఎం జగన్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. మాకవరపాలెం మెడికల్ కాలేజీని సందర్శించనున్నారు. అయితే.. రోడ్డు మార్గంలో వెళ్లడానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.
ఎయిర్‌పోర్ట్ నుంచి మాకవరపాలెం మెడికల్ కాలేజీకి 63 కిలోమీటర్ల దూరం ఉంటుందని.. రోడ్డు మార్గంలో వెళ్తే.. ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని అనుమతి నిరాకరిస్తున్నామని.. హెలికాప్టర్ ద్వారా వెళ్లడానికి అనుమతిస్తామన్నారు. అయితే.. తమకు ఎవరి అనుమతి అవసరం లేదని.. జగన్ రోడ్డు మార్గంలోనే మెడికల్ కాలేజీకి వెళ్తారని వైసీపీ నాయకులు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో జగన్ మెడికల్ కాలేజీ సందర్శనపై ఉత్కంఠ నెలకొంది.