40వ వసంతంలోకి అడుగుపెడుతున్న టీడీపీ.. 1982 టీడీపీని స్థాపించిన స్వర్గీయన ఎన్టీఆర్...

TDP Formation Day 2022: వాడవాడల పార్టీ జెండా ఆవిష్కరించనున్న నేతలు, కార్యకర్తలు...

Update: 2022-03-29 02:00 GMT

40వ వసంతంలోకి అడుగుపెడుతున్న టీడీపీ.. 1982 టీడీపీని స్థాపించిన స్వర్గీయన ఎన్టీఆర్...

TDP Formation Day 2022: తెలుగు దేశం పార్టీ 40వ వసంతంలోకి అడుగు పెడుతోంది. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో స్వర్గీయ నందమూరు తారక రామారావు టీడీపీని స్థాపించారు. ఇప్పటికికీ అదే నినాదంతో పార్టీ నడుస్తోంది. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన టీడీపీ 1982 నుండి నేటి వరకు అనేక ఒడి దుడుకల మధ్య తన ప్రస్తానాన్ని కొనసాగిస్తూ వచ్చింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పార్టీని ప్రారంభించగా.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టారు. అధికారంలో ఉన్నా.. అధికారానికి దూరంగా ఉన్నా ప్రతిపక్ష హోదాలో పార్టీని నిరాటంకంకంగా 40 ఏళ్లుగా నడిపిస్తున్నారు.

ఉమ్మడి రాష్ర్టంలోనూ.. రాష్ట్ర విభజన తర్వాత అనేక అవాంతరాలు ఎదురైనప్పటీ పార్టీని ప్రజల్లోకీ తీసుకు వెళ్లడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు. పార్టీ ఏర్పడి 40 ఏళ్లూ పూర్తి కావడంతో 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ కోసం క్యాడర్ పునరంకితం అయ్యేలా ఉండాలన్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాలతో పాటు.. తెలంగాణలోనూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడకలు పండుగలా నిర్వహించేందుకు తెలుగుతమ్ముళ్లు సిద్ధం అయ్యారు.

అందులో భాగంగా వాడ వాడలా టీడీపీ జెండాలను ఎగురవేసి...ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించనున్నారు. ఏపీలో టీడీపీ యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించున్నారు. ఉండవల్లి లోని నివాసం నుంచి టీడీపీ కేంద్ర ప్రధాన కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ రాష్ర్ట రాజధాని హైదారాబాద్ నగరంలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారు. ఉమ్మడి రాష్ర్టంలో హైదరాబాద్ లో మొదట ఎన్టీఆర్ పార్టీ ప్రకటన చేసిన ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంగణం దగ్గర చంద్రబాబు పార్టీ నేతలతో కలిసి ఆవిర్భావ వేడుకల కార్యాక్రమంలో పాల్గొననున్నారు.

ఆ తర్వాత ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు చేరుకుంటారు. పార్టీ నేతలతో కలిసి ఆవిర్భావ వేడుకల్లో పాల్గొననున్నారు. పార్టీ ఆవిర్భావ సందర్భంగా 40ఏళ్ళు నేటితో పూర్తవడంతో ప్రత్యేక లోగోను సైతం సిద్ధం చేసిన 40ఏళ్ల ప్రస్థానంలో పార్టీ పరంగా ఎదుర్కొన్న అనేక ఘట్టాలను నేటి తరానికి చూపించే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ.

Tags:    

Similar News