Changes in Inter Exam Pattern: ఇంటర్ పరీక్షల్లో మార్పులు.. ఏడాదికి మూడు ఆన్‌లైన్‌ పరీక్షలు?

Changes in Inter Exam Pattern: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కొత్త విద్యాసంవత్సరం అధికారికంగా ప్రారంభం కాకపోయినప్పటికీ తెలంగాణ ఇంటర్ బోర్డు మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లపోతుంది.

Update: 2020-07-16 13:00 GMT
Changes in Inter Exam Pattern

Changes in Inter Exam Pattern: కరోనా నేపథ్యంలో ఈ ఏడాది కొత్త విద్యాసంవత్సరం అధికారికంగా ప్రారంభం కాకపోయినప్పటికీ తెలంగాణ ఇంటర్ బోర్డు మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్లపోతుంది. కళాశాలలు ఎప్పుడు ప్రారంభం అయితే ఆ అకడమిక్‌ ఇయర్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అడుగు ముందుకు వేస్తుంది. ఈ క్రమంలోనే ఇంటర్ బోర్డు ఇంటర్ విద్యార్ధుల పరీక్షల్లో కీలక మార్పులు చేసేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగానే పరీక్ష ప్రశ్నపత్రాల రూపకల్పన, మార్కుల కేటాయింపు ఇతన అంశాల్లో వివిధ సంస్కరణలు ప్రతిపాదిస్తూ ఇంటర్ బోర్టు ప్రభుత్వానికి నివేదిక పంపింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపితే (2020-21) కొత్త విద్యా సంవత్సరం నుంచి సంస్కరణలను అమలు చేయాలని భావిస్తోంది.

అయితే కొత్త విధానం ప్రవేశపెడితే ఇంటర్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని సూచించారు. అంతే కాక ఇదివరకు లాగా లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు మాత్రమే ఇప్పటి నుంచి 40 శాతం మార్కులకు మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు (ఎంసీక్యూ) ఉండాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే ఇంటర్ పరీక్షలు ఆన్‌లైన్‌ లో నిర్వహించడం కొంత భారమే అయినా చివరి పరీక్షలు 40 శాతం మార్కులకే కాబట్టి వాటి జవాబు పత్రాల పేజీల సంఖ్య సగానికి పైగా తగ్గిపోతుంది. మొదట్లో కొంత భారమైనా క్రమేణా వ్యయం తగ్గుతుంది అని అధికారులు భావిస్తున్నారు. అంతే కాక పరీక్ష పేపర్ల మూల్యాంకనానికి కూడా చాలా తక్కువ సమయమే పడుతుంది. ఆన్‌లైన్‌ మూల్యాంకనానికి వెళితే అధ్యాపకుల రాకపోకలు తగ్గిపోతాయి. అయితే ఈ ఏడాదిలో ఇలాంటివి పరీక్షలను మూడింటిని నిర్వహించి వాటిల్లో అధిక మార్కులు వచ్చిన రెండిటి సగటు తీసుకుని తుది మార్కులు ఇవ్వాలని పేర్కొన్నారు.

ఇక పోతే ప్రస్తుతం రాష్ట్రంలో నిర్వహిస్తున్నపలు ప్రవేశ పరీక్షలను టీసీఎస్‌ అయాన్‌ తదితర సంస్థలే జరుపుతున్నాయి. కొత్త పద్దతి కనుక అందుబాటులోకి వస్తే ఇంటర్ పరీక్షల నిర్వహణ కూడా అలాంటి సంస్థలకు అప్పగించవచ్చని తెలిపారు. ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు వంటి వాటికి ఈ మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. అలానే ఇంటర్నల్స్‌కు 20 శాతం మార్కులు ప్రతిపాదించారు. తుది పరీక్షలు 40 శాతం మార్కులకు ఉండేలా సూచించారు. ఇక ఇప్పటికే పాత పద్దతి ద్వారా ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలు బైపీసీ, ఎంపీసీ గ్రూపులకు సంబంధించి ప్రాక్టికల్‌ మార్కుల్లో అవకతవకలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీని ద్వారా ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు నష్టపోతారనే విమర్శలూ ఉన్నాయి. ఇంటర్ బోర్టు ఇప్పుడు తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రయివేటు కాలేజీలకు వరంలా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News