Chandrababu Naidu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
Chandrababu Naidu: ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుల నిధులపై చర్చ
Chandrababu Naidu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
Chandrababu Naidu: ఈ నెల 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుల నిధులపై చర్చించిన సీఎం.. రాష్ట్రాభివృద్ధి ప్రధాన అజెండాగా ఎంపీలు పనిచేయాలన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కృషి చేయాలని సూచించారు. కేంద్రంతో సమన్వయం కోసం ఒక్కొక్క ఎంపీకి ఒక్కో శాఖను కేటాయించారు.
రాష్ట్ర మంత్రులను వెంటపెట్టుకుని ఆయా శాఖల కేంద్రమంత్రులను ఎంపీలు కలవాలని చెప్పారు. అలాగే.. ప్రాజెక్టులకు భూముల కేటాయింపు సంబంధించిన అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఢిల్లీలో మాజీ సీఎం జగన్ ధర్నా చేస్తారనే అంశం సమావేశంలో ప్రస్తావనకు రాగా.. ఢిల్లీలో జగన్ ఏం చేస్తారో ముఖ్యం కాదు.. మనమేం చేయాలన్నదే ముఖ్యమని ఎంపీలకు సీఎం చంద్రబాబు సూచించారు.