Kesineni Chinni: రాజ్ కసిరెడ్డితో వ్యాపారాలు నిజమే.. కేశినేని చిన్ని క్లారిటీ, సీబీఐకు లేఖ..!
Kesineni Chinni: లిక్కర్ స్కాంలో ఆరోపణలపై కేశినేని చిన్ని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు.
Kesineni Chinni: లిక్కర్ స్కాంలో ఆరోపణలపై కేశినేని చిన్ని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. రియల్ ఎస్టేట్ విషయంలో మాత్రమే రాజ్ కేసిరెడ్డిని కలిశానని..ఆయనతో కంపెనీ పెట్టిన మాట వాస్తవమని తెలిపారు. కానీ జగన్ మనిషి అని తెలిశాక రాజ్ కేసిరెడ్డికి దూరంగా ఉన్నానన్న కేశినేని చిన్ని.. ఒక ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలస్ 4వ నెంబర్ గదిలోనే స్కామ్ ప్లాన్ చేశారన్నారు. ఏవో రెండు కంపెనీల పేర్లు చెప్పి లావాదేవీలు జరిగాయని తనపై నిందలేస్తున్నారని.. కానీ ఆ కంపెనీలు ఎవరివో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు చిన్ని.
లిక్కర్ స్కామ్‌పై సీబీఐ విచారణ కోరారు కేశినేని చిన్ని. మద్యం కుంభకోణం దర్యాప్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణంపై విచారణ జరిపించి నిజాలు తేల్చాలని కోరారు. తాను సీబీఐకి లేఖ రాసిన విషయాన్ని చంద్రబాబుకు తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు చిన్ని. తమ పార్టీ ఎంపీ స్కాంలో పాత్రధారి అనే ఆరోపణలు వచ్చాయని.. అందుకే పారదర్శక దర్యాప్తు జరగాలంటే సీబీఐకి కేసు బదిలీ చేయాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తి పారదర్శకత మరియు బాధ్యతాయుతమైన పాలనే కావాలని.. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ, సీఎంగా తగిన చర్యలు తీసుకుంటారని నమ్మకంతో విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.