MLC Ashok Babu Comments on AP Govt: ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం రూ.3వేల కోట్ల కుంభకోణానికి పాల్పడింది

MLC Ashok Babu Comments on AP Govt: టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు మనసురావడం లేదని ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Update: 2020-07-06 11:15 GMT
Ashok Babu (File Photo)

MLC Ashok Babu Comments on AP Govt: టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు మనసురావడం లేదని ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తక్షణమే పేదలకు కేటాయించాలి కోరారు. 15 నెలలైనా ఎందుకు కాలయాపన చేస్తున్నారో సమాధానం చెప్పాలి. ప్రభుత్వం 151 సీట్లున్నాయని, వాపుని చూసి బలుపు అనుకుంటోంది. 2014-2019 మధ్యన కేంద్రం, రాష్ట్రానికి 15 లక్షల ఇళ్లు కేటాయించిందని తెలిపారు. ఈ 15లక్షల ఇండ్లలో 8.50లక్షల ఇళ్లను గత ప్రభుత్వమే పేదలకు ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గృహప్రవేశాలకు సిద్ధమైన 6లక్షల ఇళ్లను నిరుపయోగంగా మార్చిందన్నారు.

అత్యాధునిక వసతులతో, నాణ్యతా ప్రమాణాలతో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను, వైసీపీ ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలుగా మార్చిందని ఆవేదం వ్యక్తంచేసారు. పూర్తైన ఇళ్లను పేదలకు కేటాయించకుండా, ఇళ్లస్థలాల పేరుతో ప్రభుత్వం ప్రజలను మోసగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఊళ్లకు దూరంగా, రోడ్డు, నీటి, విద్యుత్ వసతి లేని ప్రాంతాల్లో సెంటు స్థలం ఇస్తే, పేదలకు ఏమి ఉపయోగపడుతుందని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ ప్రభుత్వం రూ.3వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందన్నారు. ప్రభుత్వ అవినీతిపై సీబీఐ వెంటనే విచారణ జరిపించాలని కోరారు. పాలకులు నేలమీదకు దిగిరావడానికి ఎంతో సమయం పట్టదు.


Tags:    

Similar News