Peddapuram: రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోంది: ఎమ్మెల్యే రాజప్ప

రాష్ట్రంలో తుగ్లక్ పరిపాలన సాగుతోందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

Update: 2020-01-25 11:25 GMT

పెద్దాపురం: రాష్ట్రంలో తుగ్లక్ పరిపాలన సాగుతోందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి రాజధాని నాశనం చేయాలనే ఉద్దేశంతో అరాచక పరిపాలన సాగిస్తున్నారన్నారు. మొదట అమరావతిపై తరువాత పోలవరంపై కన్ను వేసి అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించారన్నారు.

రాష్ట్రంలో శాసన మండలిని రద్దు చేసే ప్రసక్తే లేదని అన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని శాసనమండలిలో సిఫారసు చేసిన షరీఫ్ పై మంత్రులు, ఎమ్మెల్యేలు కులం పేరుతో దూషించడం అన్యాయమన్నారు. జగన్ ప్రభుత్వంలో రౌడీలు, నేరస్తులను 80శాతం ఉన్నారన్నారు. జగన్ ఏవన్ ముద్దాయి అయితే విజయసాయిరెడ్డి ఏటూ ముద్దాయి అని ఇటువంటి వ్యక్తులు శాసనమండలిలో మాట్లాడే అర్హత లేదని అన్నారు. అమరావతి రైతులు, మహిళలు గగ్గోలు పెడుతున్న వారిపై లాఠీచార్జీ చేసి తప్పుడు కేసులు బనాయించడం సీఎంకు తగునా అని ఘాటుగా చినరాజప్ప విమర్శించారు. 

Tags:    

Similar News