జగన్‌ ప్రభుత్వానిది రాక్షస పాలన .. విశాఖ ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు

పోలీసులు వైసీపీ కార్యకర్తల్ని ఎందుకు అదుపు చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు సరిగా విధులు నిర్వర్తించడం లేదని ఆరోపించారు.

Update: 2020-02-29 07:02 GMT
వర్ల రామయ్య (ఫైల్ ఫోటో)

టీడీపీ నేతల బృందం శనివారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో గవర్నర్‌తో భేటీ అయ్యింది. చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్ బిశ్వభూషణ్‌ను ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వినపత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడారు. చంద్రబాబుపై కోడిగుడ్లు, టమాటాలు ప్రజలేవిసిరారని వైసీపీ నేతలు విశాఖ ప్రజలు అవమానిస్తున్నారని మండిపడ్డారు. విశాఖ వాసులు వైసీపీ నేత మాదిరి ప్రవర్తించే క్రూరులు కారని వ్యాఖ్యానించారు. విశాఖ ప్రజలను శాంతికి నిదర్శనంగా ఉంటారిని, వారిని వైసీపీ నేతలు విశాఖ వాసులను సంఘ విద్రోహులతో పోల్చుతున్నారని విమర్శించారు.

వైసీపీ రౌడీయిజం చేస్తూ.. విశాఖ అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. వైసీపీ అల్లర్లను ప్రోత్సహించడం ద్వారా పెట్టుబడులు రాకుండా చేస్తూ ఉపాధికి గండి కొడుతుందని ఆరోపించారు. ఈనెల 27న చంద్రబాబుపై జరిగిన ఘటనతో జగన్‌ క్రూరత్వం బయటపడిందని, ప్రతి ఒక్కరు గ్రహించాలని యనమల రామకృష్ణుడు అన్నారు .

టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. పోలీసులు వైసీపీ కార్యకర్తల్ని ఎందుకు అదుపు చేయలేదని ప్రశ్నించారు. పోలీసులు సరిగా విధులు నిర్వర్తించడం లేదని ఆరోపించారు. శాంతి భద్రతల కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జగన్ ప్రభుత్వానిది రాక్షస పాలన అంటూ మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వానికి ఏ వ్యవస్థపైన నమ్మకం లేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్విర్యం చేస్తుందని వర్ల రామయ్య ఆరోపించారు.

టీడీపీ చంద్రబాబు విశాఖ పర్యటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం విశాఖ రెండు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన చంద్రబాబును విమానాశ్రయం బయట నిరసనకారులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ జరిగిన తదితర పరిణామాలపై పోలీసులు తీరుపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుమారు 5 గంటల పాటు ఎయిర్‌పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను హైదరాబాద్‌కు పంపిన విషయం తెలిసిందే.

  Full View


Tags:    

Similar News