సీఎం జగన్, అంబానీ మధ్య ఒప్పందం ఇదేనా..

ఏపీ సీఎం వైఎస్ జగన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్‌ అంబానీల భేటీపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.

Update: 2020-03-01 16:34 GMT
Varla Ramaiah

ఏపీ సీఎం వైఎస్ జగన్‌, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్‌ అంబానీల భేటీపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. అంబానీకి సీఎం జగన్‌ ఏ బహుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య క్విడ్‌ ప్రోకో ఏంటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ..వైఎస్ రాజశేఖరరెడ్డి హత్య వెనుక రిలయన్స్‌ హస్తముందనే అభియోగాలతో అప్పట్లో రిలయన్స్‌ హస్తముందే ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేశారు. వైఎస్ఆర్ అభిమానులు రిలయన్స్ కు చెందిన పలు సంస్థలపై దాడులు చేశారని, ఇప్పటికీ కేసులో అనేక మంది జైళ్లలో మగ్గుతున్నారని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

సీఎం వైఎస్ జగన్‌, ముఖేష్‌ అంబానీ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపణలు చేశారు. అంబానీకి సాదర స్వాగతం ఎలా పలుకుతారని సీఎం జగన్ ను వర్ల రామయ్య ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్త పరిమల్‌ నత్వానీ త్వరలో రాజ్యసభ సభ్యత్వం ముగియనుందని, ఆయన్నూ పార్లమెంటుకు పంపేందుకే ఈ భేటీ జరిగిందా అని నిలదీశారు. జగన్‌, అంబానీ మధ్య జరిగిన ఒప్పందం బయటపెట్టాలని నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఎలాంటి సయోధ్య కుదిరిందని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడిని అంబానీ మీ దగ్గరకు వస్తే ఏమనుకోవాలని వర్ల రామయ్య ప్రశ్నించారు. వైసీపీకి నీతులు మాట్లాడే నైతిక హక్కులేదని మండిపడ్డారు.

Tags:    

Similar News