జూనియర్ ఎన్టీఆర్ విషయంలో వర్ల రామయ్య బరస్ట్ అయ్యారా?

Update: 2019-11-18 05:08 GMT

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోతు పోతూ.. టీడీపీలో పితలాటకం పెట్టాడు. 23 సీట్లు రావడంతో జూనియర్ ఎన్టీఆర్ వస్తాడేమోనని టీడీపీ బయపడుతుందన్నారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ ఖండించింది. తారక్ తెలుగుదేశం పార్టీ వాడేనని.. సినిమాల్లో బిజిగా ఉన్నందున పార్టీ కార్యక్రమాలకు రాలేకపోతున్నాడని కొందరు అంటుంటే.. టీడీపీ పొల్యూట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాత్రం తారక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మాకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు.. మా నాయకుడు చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్'అన్నారు. అసలే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే టీడీపీకి దూరంగా ఉంటున్నారు.. తాజాగా వర్ల రామయ్య చేసిన చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయని ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారట.

 తారక్ విషయంలో వర్ల రామయ్య అతి వివరణపై టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారట. తారక్ అవసరం పార్టీకి లేదని అనడం సరికాదంటున్నారట. ఏనాటికైనా టీడీపీకి తారక్ అవసరం ఉండవచ్చు.. అలాంటప్పుడు పార్టీకి దూరంగా ఉన్న మాత్రనా విమర్శలు చేయడం ఏంటని అనుకుంటున్నారట. గతంలో కూడా కోడెల ప్రసాద్ రావుపై కూడా వర్ల చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశయం అయ్యాయి. వర్ల లాంటి నేతల వల్లే కోడెల మనస్థాపం చెందారని వైసీపీ విమర్శలు చేసింది. ఇదిలావుంటే ఎన్టీఆర్ విషయంలో వర్ల రామయ్య ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడానికి కారణం వల్లభనేని వంశీయేనని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారట. వంశీ పోతూ పోతూ టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేయడం వల్లే వర్ల రామయ్య లాంటి దూకుడు నేతలు బరస్ట్ అయ్యారని అనుకుంటున్నారట.

Tags:    

Similar News