Vangalapudi Anitha: జగన్ అధికారంలోకొచ్చాక.. సీఎం జగన్ చేసిందేమీ లేదు
NTR హెల్త్ వర్సిటీకి పేరు మార్చడాన్ని నిరసిస్తూ..అనకాపల్లి మండలం పాయకరావుపేటలో టీడీపీ దీక్షలు
Vangalapudi Anitha: జగన్ అధికారంలోకొచ్చాక.. సీఎం జగన్ చేసిందేమీ లేదు
Vangalapudi Anitha: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ.. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రధన రహదారిపై టీడీపీ నేతలతో కలిసి రిలే దీక్షలు చేపట్టారు. ఈసందర్భంగా అనిత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకొచ్చిన మూడున్నరేళ్లలో సీఎం జగన్ ప్రజావేదికలు,గత ప్రభుత్వం చేసిన పనులు నాశనం చేయడం తప్ప..చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ది పనికూడా చేయలేదన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడం సరికాదన్నారు.