Andhra Pradesh: సంగం డైరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
Andhra Pradesh: సంగం డైరీ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ధూళిపాళ్లను అరెస్టు చేసినట్లు ఏసీబీ తెలిపింది
Tdp Leader Dhulipalla Narendra:(File Image)
Andhra Pradesh: టీడీపీ సీనియర్ నేత, సంగం డెయిరీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అరెస్ట్ చేసింది. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద తెల్లవారుజామునే సుమారు 100 మందికి పైగా పోలీసులు మోహరించారు. అనంతరం నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి తమ వాహనంలో తీసుకెళ్లారు. సంగం డైరీ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తెలిపింది.
మరోవైపు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నరేంద్రను అరెస్ట్ చేయడమేంటని స్థానికి టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు నరేంద్రను ఎక్కడికి తరలించారు అనేది ఇంత వరకు తెలియరాలేదు.