కరోనా విషయంలో వాస్తవాలు దాచి సీసీ కెమెరాల‌ గురించి మాట్లాడుతున్నారు : దేవినేని ఉమ

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధనాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్‌, సుజనా చౌదరి రహస్యంగా సమావేశం కావడంపై రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2020-06-23 13:58 GMT
Devineni Uma (File Photo)

ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధనాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్‌, సుజనా చౌదరి రహస్యంగా సమావేశం కావడంపై రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై కావడంపై అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టారు.

మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ స్పందించారు. పార్క్ హయత్ సీసీ కెమెరాల‌ గురించి మాట్లాడటం అసమర్ధ రాజకీయం పరాకాష్ఠ అని విమర్శించారు. పాలన చేతకాక అసమర్ధ ప్రేలాపనలతో సీసీ కెమెరాల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విధ్వంసంతోనే జగన్ పాలన ప్రారంభమైందని దుయ్యబట్టారు. టీడీపీ నేతలపై అక్రమకేసులు పెడుతున్నారని ఆరోపించారు. త్వరలో టీడీపీ నేతలందరికీ తలా ఒక ఖైదీ నంబరు ఇస్తారా అని ప్రశ్నించారు.

కరోనా విషయంలో వాస్తవాలు దాచిపెడుతున్నరని, ఆరోగ్య శాఖామంత్రి వాస్తవాలు చెప్పాలి డిమాండ్ చేశారు. ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు ఫార్వర్డ్ చేస్తే కేసులు పెట్టారు. పరిపాలన చేతకాక ఈ ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని పట్టాభి చూపించడంతో పోలీసులను పంపి బెదిరించారని ఆరోపించారు. రెండు రోజుల్లో పోలీసు కమీషనర్ ను కలుస్తామని, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మాజీమంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. పట్టాభి పైన కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని సీఎం వైఎస్ జగన్ చూస్తున్నారని ధ్వజమెత్తారు.


Tags:    

Similar News