Buddha Venkanna: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బహిరంగంగా ఎన్‌కౌంటర్ చేయాలి
Buddha Venkanna: పల్నాడులో ముగ్గురు టీడీపీ కార్యకర్తలను చంపేశారు
Buddha Venkanna: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బహిరంగంగా ఎన్‌కౌంటర్ చేయాలి
Buddha Venkanna: టీడీపీ నేత బుద్ధా వెంకన్న హాట్ కామెంట్స్ చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బహిరంగంగా ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. జల్లయ్య హత్యను తీవ్రంగా ఖండించిన బుద్ధా వెంకన్న బాధిత కుటుంబ సభ్యుల పరామర్శకు పల్నాడు బయలుదేరారు. అయితే అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు బుద్ధా వెంకన్నను హౌస్ అరెస్ట్ చేశారు.
ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తుందని హత్యలు చేయమని సీఎం ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అందుకే వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు. పల్నాడులో ముగ్గురు టీడీపీ కార్యకర్తలను చంపేశారని ఈ హత్యల వెనుక పిన్నిల్లి రామకృష్ణారెడ్డి సూత్రధారి అని ఫైర్ అయ్యారు.