ఏపీ ప్రభుత్వంపై అశోక్ గజపతి రాజు హాట్ కామెంట్స్
*ధర్మకర్తగా తొలగించే ముందు నోటీసులు ఇవ్వలేదు- అశోక్ గజపతి రాజు *రాజ్యాంగం, చట్టాలని విస్మరించారు - అశోక్ గజపతి రాజు *చట్టాలను గౌరవించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు- అశోక్ గజపతి రాజు
అశోక్ గజపతి రాజు
దేశంలో రాజ్యాంగం, చట్టాలున్నాయని జగన్ ప్రభుత్వానికి కనీసం ఆలోచన లేదన్నారు అశోక్ గజపతిరాజు. మానసికంగా, పరిపాలన పరంగా తమను వేధించాలనే ఆలోచనలోనే ప్రభుత్వం ఉందని ఆరోపించారు. సింహాచలం దేవస్థానం పరిధిలో గోవులకు దాణా వేయకుండా హింసా పాపాన్ని మూటగట్టుకుంటే.. మంత్రి వెల్లంపల్లి మాట్లాడిన మాటలు బాధాకరమన్నారు అశోక్ గజపతి రాజు.