Chandrababu Naidu Fire on Andhra Pradesh Government: చావులోనైనా గౌరవించండి.. జగన్ సర్కార్ తీరుపై చంద్రబాబు ఆగ్రహం!

Chandrababu Naidu Fire on Andhra Pradesh Government: కరోనా చేటుకాలంలో మానవ సంబంధాలన్నీ మంటకలిసిపోయాయి.

Update: 2020-06-27 02:30 GMT
chandrababu Naidu (File Photo)

Chandrababu Naidu Fire on Andhra Pradesh Government: కరోనా చేటుకాలంలో మానవ సంబంధాలన్నీ మంటకలిసిపోయాయి. మరణిచిన వ్యక్తిని నలుగురు మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించలేని దుస్థితి దాపురించింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటుచేసుకుంది. కాశీబుగ్గ పురపాలక సంఘంలో కరోనా వైరస్ లక్షణాలతో వ్యక్తి మరణించాడు. అతని మృతదేహాన్ని తరలించేందుకు వాహనదారులెవరూ ముందుకు రాలేదు. వ్యక్తి అంత్యక్రియలు విషయంలో అధికారులు అమానవీయంగా వ్యవహరించారు. చివరకు ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మరో ఇద్దరు కుటుంబసభ్యులు కలిసి.. మృతదేహాలను ప్లాస్టిక్ కవర్లలో చుట్టి జేసీబీలో తరలించి అంతిమ సంస్కారం చేయించారు. సోంపేటలో గురువారం రాత్రి చనిపోయిన వృద్ధురాలినీ నలుగురు పారిశుద్ధ్య సిబ్బంది పంచాయతీట్రాక్టర్‌లో శ్మశానవాటికకు తరలించారు. మృతదేహం వెంట ఇద్దరు కుటుంబీకులు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

అయితే ఈ విషయంపై ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. కరోనా లక్షణాలతో మరణించినవారి మృతదేహాలను ప్లాస్టిక్‌ కవర్లతో చుట్టి.. జేసీబీ, ట్రాక్టర్లలో తరలించడం చూసి తీవ్ర దిగ్భ్రాంతి కి గురయ్యానని చంద్రబాబు ట్వీట్‌ చేశారు. కనీసం చావులోనైనా కరోనా బాధితులకు గౌరవప్రదంగా నిర్వహించాల్సిందని అన్నారు. మృతదేహాల విషయంలో ఇంత అమానవీయంగా వ్యవహరించినందుకు జగన్‌ ప్రభుత్వం సిగ్గుపడాలని చంద్రబాబు ట్వీట్ చేసారు.

కొవిడ్ లక్షణాలతో మృతిచెందిన వారి మృతదేహాన్ని జేసీబీలో తరలించిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని సీఎం జగన్‌ అన్నారు. పునరావృతం కాకూడదంటే బాధ్యులపై చర్యలు తీసుకోకతప్పదని సీఎం ట్వీట్‌ చేశారు. ఈ ఘటనపై సీఎంవో తీవ్రంగా పరిగణించింది. కరోనా మృతుల విషయంలో ఎలా వ్యవహరించాలో స్పష్టమైన నిబంధనలున్నా.. ఉల్లంఘించి జేసీబీతో మృతదేహాన్ని తరలించడాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. శ్రీకాకుళం జిల్లా పలాస పురపాలక కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్‌ని ప్రభుత్వం శుక్రవారం రాత్రి సస్పెండ్‌ చేసింది.



Tags:    

Similar News