ప్రధాని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: చంద్రబాబు

Chandrababu Naidu Conducted Webinar : ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.

Update: 2020-10-08 13:18 GMT

 Chandrababu Naidu 

Chandrababu Naidu Conducted Webinar : ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తో ప్రజలు ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కరోనా కేసుల నమోదులో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని, ప్రధాని జాగ్రత్తలు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇక మద్యం షాపులు, స్కూళ్ళు తెరిచే ఉత్సాహంలో ప్రభుత్వం ఉందని కరోనాతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న వివిధ వర్గాలతో నిర్వహించిన వెబినార్‌లో చంద్రబాబు అన్నారు.

ఆసియా దేశాల్లో కరోనా రెండోసారి తిరగబడుతోంది. కరోనా సోకిన వారిలో తీవ్ర ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని అన్నారు. పోస్టు కొవిడ్‌ను ఎదుర్కోవడంపైనే అందరి భవిష్యత్తు ఆధారపడి ఉందని అన్నారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు అన్నారు. కరోనా కేసుల నమోదులో రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు. నియంత్రణలో విఫలమైనందునే కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ప్రధాని జాగ్రత్తలు చెబుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మద్యం దుకాణాలు, పాఠశాలలు తెరుద్దామనే ఉత్సాహంతోనే ఉన్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు!

ఇక ఏపీలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి నిన్నటి వరకు ( అక్టోబర్ 07) వరకు ఉన్న సమాచారం మేరకు రాష్ట్రంలో కొత్తగా 5,120 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో కేసుల సంఖ్య 7,31,532 కు చేరుకుంది. ఇందులో 6,75,933 మంది డిశ్చార్జ్ కాగా, 49,513 మంది వివిధ ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్నారు. ఇక ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం 62,83,009 కరోనా టెస్టులని నిర్వహించింది. 

Tags:    

Similar News