అప్పుడు జగన్ .. ఇప్పుడు చంద్రబాబు

ఏపీలో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విశాఖ పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుకి అడ్డంకులు ఎదురయ్యాయి.

Update: 2020-02-27 10:21 GMT
Jagan and chandrababu (File Photo)

ఏపీలో ప్రస్తుతం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విశాఖ పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుకి అడ్డంకులు ఎదురయ్యాయి. అయన వాహనాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీనికి పోటీగా టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ప్రస్తుతం అక్కడి వాతావరణం యుద్దభూమిని తలపిస్తుంది. ఇక ఇప్పటికే రెండుగంటలకు పైగా వాహనంలో కూర్చొన్న చంద్రబాబు.. కొద్దిసేపటి క్రితం కిందికి దిగి టీడీపీ నేతలతో కలిసి రోడ్డుపైన బైఠాయించారు. అయితే ఈ సందర్భంగా అందరూ 2017లో జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటున్నారు.

ప్రత్యేక హోదా కోసం అప్పటి ప్రతిపక్ష నేత అయిన జగన్ 2017లో జనవరి 26న విశాఖపట్టణంలో క్యాండిల్ ర్యాలీ సిద్దం అయ్యారు. అయితే దీనికి తెదేపా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే అప్పుడే విశాఖలో సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ జరుగుతోంది . అయితే ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం చేస్తామని వైసీపీ ప్రకటించింది. దీనితో జగన్ తో సహా పలువురు నేతలు కలిసి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.


అనుమతి లేకుండా వైఎస్సార్‌సీపీ నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టడం, ఎయిర్‌పోర్టుకు రావడంతో వారిని బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీనితో జగన్ తో సహా పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు కలిసి ఎయిర్‌పోర్టు రన్‌వే పైనే బైఠాయించి నిరసన తెలిపారు. దీనితో పోలీసులు వారిని అరెస్ట్ చేసి హైదరాబాదుకు తరలించారు. ఇప్పుడు అలాంటి సంఘటనే మూడేళ్ళ తర్వాత చంద్రబాబుకి ఏర్పడింది.

ప్రస్తుతం చంద్రబాబు విశాఖ ఎయిర్ పోర్టు సమీపంలో ఆగిపోయారు. చంద్రబాబును అదుపులోకి తీసుకుని తిరిగి విమానాశ్రయానికి తీసుకెళ్లి అక్కడి నుంచి విజయవాడ లేదా హైదరాబాద్‌ పంపేందుకు పోలీసులు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.  

Tags:    

Similar News