Chandrababu Naidu Challenges To CM Jagan : అసెంబ్లీని రద్దు చేయండి.. మళ్లీ ప్రజల్లోకి వెళ్దాం : చంద్రబాబు

Chandrababu Naidu Challenges To CM Jagan : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్ అమరావతికి మద్దతు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక

Update: 2020-08-03 13:31 GMT
chandrababu naidu (File Photo)

Chandrababu Naidu Challenges To CM Jagan : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్ అమరావతికి మద్దతు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక మాత్రం మాట తప్పారని టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాజధాని అనే సమస్య ఏ ఒక్కరిదో కాదని, ఐదు కోట్ల మంది ప్రజలదని గుర్తు చేశారు చంద్రబాబు.. ఏపీ రాజధాని వికేంద్రీకరణపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వాఖ్యలు చేశారు చంద్రబాబు. ఇక మాట తప్పినందుకు గాను ప్రభుత్వాన్ని రద్దు చేసి, మళ్లీ ప్రజల్లోకి వెళ్దామని సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్ విసిరారు.

ఎన్నికల ముందు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ ఎందుకు చెప్పలేదని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు చేస్తామనడం సరికాదని చంద్రబాబు అన్నారు. ప్రజలను వెన్నుపోటు పొడిచిన అధికార పార్టీ మరోసారి ప్రజాతీర్పు కోరాలని చంద్రబాబు అన్నారు. ఇక దీనిని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటు సరైన నిర్ణయమని భావిస్తే అందరం రాజీనామాలు చేసి ప్రజల వద్దకు వెళ్దామని, రాజీనామాలు చేయడానికి టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇక వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అయితే అసెంబ్లీ రద్దు చేయడానికి 48 గంటలు సమయం ఇస్తున్నానని చంద్రబాబు అల్టిమేటం జారీ చేశారు. తిరిగి ప్రజా తీర్పు కోరడం ద్వారా ప్రజలు ఎవరిని విశ్వసిస్తున్నారనే విషయం తెలిసిపోతుందని చంద్రబాబు వాఖ్యానించారు. దీనితో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి.

Tags:    

Similar News