Kondapalli Municipal Election: ఉత్కంఠగా మారిన కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక
*ఇండిపెండెంట్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీ కౌంట్ 15 *ఎంపీ కేశినేని ఓటు వినియోగంపై హైకోర్టులో కేసు
ఉత్కంఠగా మారిన కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక(ఫోటో- ది హన్స్ ఇండియా)
Kondapalli Municipal Election: కొండపల్లి ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. టీడీపీ- వైసీపీ చెరో 14 ఓట్లు ఉండగా ఇండిపెండెంట్‌గా గెలిచిన వ్యక్తి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీడీపీ బలం 15కి చేరింది.
వైసీపీ తరపున ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, టీడీపీ తరపున ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిషియో ఓట్లు ఉన్నాయి. అయితే ఎంపీ కేశినేని నాని ఓటు వినియోగంపై హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే విజయవాడ కార్పొరేషన్‌లో ఎంపీ కేశినేని నాని ఓటు హక్కు వినియోగించుకున్నారు.