కాసేపట్లో తారకరత్నకు కీలక వైద్యపరీక్షలు.. ఆ తరువాత హెల్త్ బులెటిన్ విడుదల..

Taraka Ratna Latest Health Update: బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్నకు చికిత్స కొనసాగుతుంది.

Update: 2023-01-30 04:58 GMT

కాసేపట్లో తారకరత్నకు కీలక వైద్యపరీక్షలు.. ఆ తరువాత హెల్త్ బులెటిన్ విడుదల..

Taraka Ratna Latest Health Update: బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్నకు చికిత్స కొనసాగుతుంది. ఇవాళ ప్రత్యేక వైద్యుల బృందం కీలక పరీక్షలు చేయనుంది. మరోసారి తారకరత్న హెల్త్‌ బులెటెన్‌ విడుదల చేయనున్నారు. వైద్య బృందం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్ చేస్తోంది. డాక్టర్ల శ్రమ ఫలించింది. గుండె పనితీరులో మెరుగుదల కన్పించిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మెదడు పనితీరు మెరుగుపరచేందుకు వైద్య నిపుణులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

తారకరత్నను చూసేందుకు నిన్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కుటుంబ సమేతంగా ఆస్పత్రికి వచ్చారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్నకు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారన్నారు జూనియర్ ఎన్టీఆర్. క్రిటికల్ గా ఉన్నప్పటికీ వైద్యానికి స్పందిస్తున్నారని.. నిన్నటితో పోలిస్తే పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పారని అన్నారు. మరోవైపు కర్ణాటక మంత్రి కూడా నారాయణ హృదయాలయ ఆస్పత్రికి చేరుకొని, తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు.

Tags:    

Similar News