Vinjamooru: ముందు జాగ్రత్తలు పాటిద్దాం - కరోనా వైరస్ ను అరికడదాం

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల ముందు జాగ్రత్తలు పాటించి వైరస్ సంక్రమణ అరికడదామని చాకలకొండ ఎ. విద్యాధికారి డాక్టర్ సిహెచ్. హరికృష్ణ తెలిపారు.

Update: 2020-03-18 03:31 GMT
Take precautions on coronavirus says Dr.CH Harikrishna in Vinjamooru

వింజమూరు:ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల ముందు జాగ్రత్తలు పాటించి వైరస్ సంక్రమణ అరికడదామని చాకలకొండ ఎ. విద్యాధికారి డాక్టర్ సిహెచ్. హరికృష్ణ తెలిపారు.ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల ముందు జాగ్రత్తలు పాటించి వైరస్ సంక్రమణ అరికడదామని చాకలకొండ ఎ. విద్యాధికారి డాక్టర్ సిహెచ్. హరికృష్ణ తెలిపారు. స్థానిక వైయస్సార్ క్రాంతి కార్యాలయంలో కరోనా వైరస్ నివారణ చర్యలపై అవాగాహన సదస్సును ఏర్పాట చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కరోనా వైరస్ తో ప్రాణభయం వద్దని వైరస్ గాలిలో జీవించలేదన్నారు. కావున గాలి ద్వారా వ్యాపించదు కనుక ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లోహ వస్తువులపై లేదా తుమ్మినపుడు నోటిని, ముక్కును శుభ్రమైన చేతి రుమాలు కాని టిష్యూ పేపర్ కాని అడ్డం ఉంచుకోవాలన్నారు.

కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే కాల్సెంటర కు తెలియజేయాలన్నారు. కొద్దిరోజులు సమూహాలు ఉన్న చోటుకి వెళ్ళడం మానుకోవాలన్నారు. ఎవరైనా ఇతర దేశాల నుంచి వచ్చినట్లయితే వారిని గుర్తించి వారి ఆరోగ పరిస్థితులను స్థానిక వైద్యారోగ్య సిబ్బంది గమనించాలన్నారు. అవసరమైతే వైద్యాధికారికి తెలియజేయాలని లేదా డివిజన్ కో-ఆర్డినేటర్ తెలిపినట్లయితే 108 వాప యానం ద్వారా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించి 14 రోజులు పరిశీలినలో ఉంచుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఎ.సి శేషారెడ్డి, ఆరోగ సిబ్బంది బాబ్జాన్, వెంకటేశ్వరరెడ్డి, షఫి, ఎ.పి.ఎం శ్రీనివాసరావు, వెలుగు సూపర్వైజర్లు వెంకటరమణమ్మ, లాజర్, యం.పార్వతి,యు.పార్వతి, విఏఏలు, సిసిలు, పొదుపు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News