మరో వివాదంలో చిక్కుకున్న 'జేసీ'.. 32 మందిపై కేసు నమోదు

Update: 2020-10-07 01:52 GMT

అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డితో పాటు 32 మందిపై 188 ఏపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని తాడిపత్రి పట్టణ పోలీసులు వెల్లడించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి పై ఇప్పటికే పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులలో కొద్దికాలం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు తండ్రీకొడుకులు.

ప్రస్తుతం బెయిల్‌పై బయటికి వచ్చారు.. 144 సెక్షన్‌తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో జైలునుంచి వచ్చిన తరువాత కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, వారి అనుచరులపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా బీఎస్‌-3 వాహనాలను బీఎస్- 4 వాహనాలుగా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్న అభియోగంపై జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డి లపై కేసు నమోదైంది.

Tags:    

Similar News