ఉధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది.. వరద ప్రవాహానికి కూలిన నాలుగు ఇళ్లు
*వరద ప్రవాహానికి కూలిన నాలుగు ఇళ్లు *ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు *వర్షాలకు బాగా నానడంతో కూలిన ఇళ్లు
ఉధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది(పేస్ బుక్ ఫోటో)
Swarnamukhi River: భారీ వర్షాలకు స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తిరుచానూరు సమీపంలోని వసుంధర నగర్‌లో నాలుగు ఇళ్లు కూలాయి. కూలడానికి మరికొన్ని ఇళ్లు సిద్ధంగా ఉండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అప్రమత్తమైన అధికారులు వసుంధర నగర్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షానికి బాగా నానడంతో స్వర్ణముఖి ప్రవాహం పెరుతుండటంతో ఇళ్లు కూలాయి.