Swami Prabodhananda: త్రైత సిద్ధాంత కర్త ప్రబోధానంద స్వామి క‌న్నుమూత‌

Swami Prabodhananda: అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలోని చిన్నపొలమడ కేంద్రంగా త్రైత సిద్ధాంతం పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పిన ప్రబోధానంద స్వామి అనారోగ్యంతో మృతి..

Update: 2020-07-09 10:45 GMT
Swami Prabodhananda(File Photo)

Swami Prabodhananda: అనంతపురం జిల్లా తాడిపత్రి మండల పరిధిలోని చిన్నపొలమడ కేంద్రంగా త్రైత సిద్ధాంతం పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పిన ప్రబోధానంద స్వామి అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. ఈయన ఆత్మజ్ఞానం పేరుతో కొన్ని వందల రచనలు చేశారు. హిందూ, ముస్లిం దేవుళ్ళ పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రెండేళ్ల క్రితం మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులపై, ప్రబోధానంద స్వామి శిష్యులు దాడికి పాల్పడడంతో ఈ ఆశ్రమం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వేలాది మంది మంది భక్తులను సంపాదించుకున్న ప్రబోధానంద స్వామి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన మృతదేహాన్ని..

తాడిపత్రి మండలం చిన్న పడమల గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించే అవకాశాలున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా ప్రబోధానంద అసలు పేరు గుత్తా పెద్దన్న చౌదరి అనీ, ఇంటి నుంచి పారిపోయాక పేరును మార్చుకుని ప్రబోధానంద స్వామిగా ఆశ్రమం మొదలుపెట్టారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈయన ఇతని వివాదాస్పద అభిప్రాయాలు, బోధనల కారణంగా ఆశ్రమానికి దగ్గరలో ఉన్న ప్రజలతో వివాదాలు తలెత్తాయి. జెసి దివాకర రెడ్డితో ఉన్న రాజకీయ విభేదాల కారణంగాను, ఆశ్రమ వాసులు, స్థానికుల మధ్య జరిగిన ఘర్షణల కారణం గానూ 2018 సెప్టెంబరులో ఆశ్రమ ప్రాంతం ఉద్రిక్తతలకు లోనైంది.


Tags:    

Similar News