Andhra Pradesh: ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్
Andhra Pradesh: 8మంది టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేసిన మండలి ఛైర్మన్
ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్
Andhra Pradesh: ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యుల తీరుపై మండలి ఛైర్మన్ మండిపడ్డారు. మండలిలో భజన కాదు, చర్చ జరగాలన్నారు. మరోవైపు టీడీపీ సభ్యులు బిజ్జగాళ్లలా వ్యవహరిస్తున్నారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. కల్తీమందుపై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. విజువల్స్ వేస్తూ.. పేపర్లు చించి విసిరేశారు. దీంతో ఆగ్రహానికి గురైన చైర్మన్ వారిని సస్పెండ్ చేశారు. అంతకుముందు లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ సభ్యులు నిరసన ర్యాలీతో శాసనమండలికి చేరుకున్నారు. మద్యం మరణాలపై శాసన సభలో చర్చించాల్సిందే అంటూ నినాదాలు చేశారు.